హలో.. ఫ్యామిలీ డాక్టర్
డాక్టర్ మామయ్య, డాక్టర్ బాబాయ్, డాక్టర్ పిన్ని.. ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ముద్దు పేర్లు. అంతగా కుటుంబంలో కలిసిపోయేవారు. నాన్న బీపీ ఎంతో, అమ్మ షుగర్ ఏ స్థాయిలో ఉందో పరీక్షించకుండానే చెప్పేవారు ఆయన.
డాక్టర్ మామయ్య, డాక్టర్ బాబాయ్, డాక్టర్ పిన్ని.. ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ముద్దు పేర్లు. అంతగా కుటుంబంలో కలిసిపోయేవారు. నాన్న బీపీ ఎంతో, అమ్మ షుగర్ ఏ స్థాయిలో ఉందో పరీక్షించకుండానే చెప్పేవారు ఆయన. తాతయ్య మందుల చిట్టా.. ఆయన నోటి చివరనే ఉండేది. పిల్లలంటే మరీ ప్రేమ. స్కూలు కబుర్లు, గల్లీ క్రికెట్ స్కోర్లు, ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లు.. ఇలా వాళ్లకు నచ్చిన ముచ్చట్లు చెబుతూ ఠక్కున ఇంజెక్షన్ పొడిచేసేవారు. చీమ కుట్టినంత సేపే నొప్పి. అంతలోనే సొరుగులోంచి ఓ చాక్లెట్ తీసిచ్చి ‘గుడ్ బాయ్’ అని భుజం తట్టేవారు. పరీక్షల అవసరం లేకుండా రోగాన్ని గుర్తించడం ఆయనకే చెల్లు. ఫీజు ఓ సమస్యే కాదు. ఉన్నప్పుడే ఇవ్వొచ్చు.
అవసరమైతే ఫోన్లోనూ స్పందించేవారు. ఆయన పేరు తలచుకోగానే సగం రోగం నయమైపోయేది. ప్రతి కాలనీలో ఫలానా డాక్టర్ క్లినిక్ అంటే ఓ ల్యాండ్మార్క్. ఆయనకు కుటుంబ ఆరోగ్య చరిత్ర తెలుసు, కుటుంబ జన్యు చరిత్ర తెలుసు. దీంతో గుర్తు చేయాల్సిన సమయంలో గుర్తుచేసేవారు, హెచ్చరించాల్సిన సమయంలో హెచ్చరించేవారు. వైద్యం వ్యాపారమయం అయిపోయాక.. ఆ డాక్టరంకుల్ క్రమంగా కనుమరుగు అవుతున్నారు. అద్దాల హాస్పిటల్స్ మోజులో ఆయనను మనం దూరం చేసుకుంటున్నాం.. కార్పొరేట్ కెరీర్లో చిక్కుకుపోయి మనకూ అతను దూరం అవుతున్నాడు. ఈ రోజు ఫ్యామిలీ మెడిసిన్ డే!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

