హైదరాబాద్ అనతికాలంలోనే బయో హబ్‌గా ఎదిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఫార్మా, కెమికల్స్ ఉత్పత్తుల్లో తెలంగాణ లీడర్‌గా అవతరించిందని చెప్పారు.
ఔషధ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ తమ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.