కరెన్సీ పతనాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. దీంతో రోజుకొక కనిష్ఠ స్థాయికి పడిపోతున్న విలువ శుక్రవారం ఏకంగా పాతాళంలోకి జారుకున్నది.
రూపాయికి మరిన్ని చిల్లులు పడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. మరో 7 పైసలు తరిగిపోయి 83.70కి జారుకున్నది.