Vidya Balan | బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డర్టీ పిక్చర్ సినిమాతో ఇండియా వైడ్‌గా సూపర్ స్టార్‌గా నిలిచింది ఈ భామ.
అందంతో ఆకట్టుకునే నటులు ఉంటారు. అభినయంతో కట్టిపడేసేవారూ ఉంటారు. ఈ రెండూ కలగలసిన అభినేత్రి విద్యాబాలన్. సంక్లిష్టమైన పాత్రలను పోషించడంలో ఆమె దిట్ట. సరదా పాత్రలనూ హుందాగా పండిస్తుంది.