అన్ని డైలాగులూ చెప్పేస్తా!
అందంతో ఆకట్టుకునే నటులు ఉంటారు. అభినయంతో కట్టిపడేసేవారూ ఉంటారు. ఈ రెండూ కలగలసిన అభినేత్రి విద్యాబాలన్. సంక్లిష్టమైన పాత్రలను పోషించడంలో ఆమె దిట్ట. సరదా పాత్రలనూ హుందాగా పండిస్తుంది.
అందంతో ఆకట్టుకునే నటులు ఉంటారు. అభినయంతో కట్టిపడేసేవారూ ఉంటారు. ఈ రెండూ కలగలసిన అభినేత్రి విద్యాబాలన్. సంక్లిష్టమైన పాత్రలను పోషించడంలో ఆమె దిట్ట. సరదా పాత్రలనూ హుందాగా పండిస్తుంది. వెటరన్ నటిగా మారిపోతున్నా.. ఇప్పటికీ ఆమె కోసం తరచూ పాత్రలు పురుడు పోసుకుంటూనే ఉన్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా నటిగా సక్సెస్‌కు కేరాఫ్‌గా నిలిచిన విద్యాబాలన్ అంతరంగం ఆమె మాటల్లోనే..
నా మొదటి సినిమా షూటింగ్ సమయంలో చిత్రమైన అనుభవం ఎదురైంది. స్క్రిప్ట్‌లో ఉన్నట్టుగానే నటించమంటే నాకు చేతకాదు. సందర్భోచితంగా కొంత మార్చేస్తుంటాను. ఆ చిత్ర దర్శకుడు దీనిని గమనించి.. ‘స్క్రిప్ట్‌లో లేదు కదా’ అన్నట్టుగా చూశాడు. ‘బాగుంది కదా!’ అన్నట్టుగా నేనూ లుక్కిచ్చా! ఆయన ఓకే చేశారు. సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు తెలియకుండానే మన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్‌లు కూడా మారిపోతుంటాయి. దర్శకుడి అంగీకారంతోనే ఇలాంటి ప్రయోగాలు చేసేదాన్ని.
నా కెరీర్లో చాలెంజ్ తీసుకొని చేసిన చిత్రం ‘డర్టీ పిక్చర్’. సిల్క్ స్మిత జీవితం పైకి కనిపించినంత అందమైనది కాదు. ఎన్నో కష్టనష్టాలను అనుభవించింది. ఆమెది ఒంటరి జీవనం. ఆ కథ నన్నెంతో ఆకట్టుకుంది. కానీ, స్మిత అనుభవించిన బాధను నేను పండించగలనా అని చాలాసార్లు అనుకున్నా! మొత్తానికి మెప్పించగలిగా!
నేను ఏదైనా సినిమా ఒకేసారి చూస్తాను. రెండోసారి చూడటం అత్యంత అరుదు. అలాంటిది ‘కుచ్ కుచ్ హోతా హై’ నాలుగుసార్లు చూశాను. ఆ సినిమాలో అన్ని పాత్రల డైలాగ్‌లు నేను చెప్పేసేదాన్ని. అంతలా ఆ చిత్రం నన్ను ఆకట్టుకుంది.
భూల్ భులయా’ సినిమా సమయంలో దర్శకుడు ప్రియదర్శన్ నాతో ‘చంద్రముఖి సినిమా మాత్రం చూడకు’ అని చెప్పారు. మాతృక చూస్తే ఆ నటన ప్రభావం మనపై ఉంటుందని ఆయన అభిప్రాయం. నిజమే కదా! దర్శకుడు కథ చెబుతున్నప్పుడు మన కండ్లముందు ఒక పాత్ర కనిపిస్తుంది. మనం నటిస్తున్నప్పుడు దర్శకుడు కూడా మనం చూసిన పాత్రనే చూడగలిగితే నటిగా సక్సెస్ సాధించినట్టే. ఆ సినిమా నాకు మంచి పేరు సాధించిపెట్టింది.
ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారు అనుకుంటే పొరపాటు. మన జీవితాన్ని ఎవరో తీర్చిదిద్దరు. ఎవరో పాడుచేయరు. బాగుపడ్డా, నాశనమైనా అందుకు కర్త, కర్మ, క్రియ అన్నీ మనమే! నేను ఈ విషయాన్ని బలంగా విశ్వసిస్తాను. అందుకే, కెరీర్‌తోపాటు వ్యక్తిగత జీవితమూ అందంగా ఉండేలా చూసుకుంటాను. అంటే తప్పులు చేయనని కాదు. చేసిన తప్పులను దిద్దుకోవడంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

