కుల వృత్తిదారులకు 250 యూనిట్ల దాకా ఉచిత కరెంటు ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం చేదోడుగా ఉంటే.. కాంగ్రెస్ సర్కారు వచ్చీరాగానే దానికి మంగళం పాడి వారిపై ఆర్థిక భారం మో పింది.
రజకులు, నాయీ బ్రాహ్మణుల మాదిరిగా లాండ్రీలు, బట్టలుతకడం, సెలూన్ల నిర్వహణపై ఆధారపడిన ముస్లింలకూ 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.