శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎడారిని తలపిస్తున్నది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండిపోతున్నది. కేసీఆర్ హయాంలో మండుటెండల్లోనూ నిండుగా కనిపించిన ఎస్సారెస్పీ.. నేడు ఎండలు ముదరక ముందే ఎండిపోతున్నది.
నాగార్జునసాగర్‌లో అడుగంటిన నీటి నిల్వలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వానలు పడినప్పటికీ, నవంబర్ చివరి దాకా సాగర్ డ్యామ్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పటికీ, గత ఐదేండ్లలో ఎన్నడూ