శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మూడో రోజు అన్నపూర్ణగా ఆరాధించడం సంప్రదాయం. అందరికీ అన్నం పెట్టి, ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి. పరమశివుడి భార్య అయిన పార్వతీదేవిని అన్నపూర్ణగా ఆరాధిస్తారు.
దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలిగే ఈ దేవి భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహాప్రకృతి స్వరూపిణి.