నేటి అలంకారం – దుర్గాదేవి
దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలిగే ఈ దేవి భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహాప్రకృతి స్వరూపిణి.
విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం
కన్యాభిః కరవాలఖేట విలద్దస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్రగదాసిఖేట విశిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే॥
దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలిగే ఈ దేవి భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహాప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీదేవతా శక్తులు, తేజస్సులు మూర్తీభవించిన తేజోరూపం ఈమె. సకల శత్రు సంహారిణి. సర్వ దుఃఖాలను నశింపజేస్తుంది.
ఉగ్రరూపంతో దుష్టులను ఏవిధంగా సంహరిస్తుందో, అదే సమయంలో పరమశాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. ఈ తల్లిని ధ్యానిస్తే సర్వరోగాలు నశిస్తాయి. ఈ రోజు చేమంతి, పొగడ, సంపెంగ, మల్లెపూలతో అమ్మను అర్చించాలి. దానిమ్మపండు సమర్పించాలి. పొంగలి, పులిహోర, పులగం నివేదించాలి.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

