అప్పులు, ఆస్తులు అనేవి ఎంతో కీలకమైనవి. చేసిన అప్పులతో ఏం చేస్తున్నారనేది ప్రధానం. రాష్ట్రమైనా, దేశమైనా అప్పులతో ఆస్తులు, సంపదను గనుక కూడబెట్టుకుంటే.. ఆ అప్పులు రాష్ట్ర, దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి
శక్తికాంతదాస్ నాయకత్వంలోని రిజర్వ్ బ్యాంక్ నుంచి ఈ మధ్య ఒక కొత్త నివేదిక వెలువడింది. ఈ నివేదికను తయారుచేసిన బృందానికి దేబబ్రత పత్ర అనే రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ నాయకత్వం వహించారు.