చెరుకు సాగును నమ్ముకున్న రైతులు లాభాల బాట పడుతున్నారు. ఈ పంట సాగుతో లాభాలు తప్ప నష్టం ఉండదని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. ఒక్కసారి పంట సాగు చేస్తే మూడేండ్ల వరకు విత్తనం వేసే పని ఉండదని పేర్కొంటున్నారు.
చెరుకు సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు రైతులకు అండగా నిలబడింది. వ్యవసాయ బావులు, బోరుల్లో పుష్కలంగా సాగు నీరు ఉండడంతోపాటు కరెంట్ సమస్య లేకపోవడంతో జహీరాబాద్ డివిజన్లో చెరుకు సాగు భారీగా పెరి