పేదలమైన తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ దంపతులు ఆందోళనకు దిగారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. భర్త కొద్దిగా పెట్రోల్ తాగడంతో వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఇందిరమ్మ కమిటీ అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.