పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. నాలుగురోజులుగా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సారపాక-భద్రాచలం పర్యటనకు సర్వం సిద్ధమైంది. నాలుగురోజులుగా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్రపతి ఏర్పాట్లపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తిచేసింది.