భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతూ పెరుగుతూ దోబూచులాడుతోంది. ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే గోదావరి వరదలతో పరీవాహక ప్రాంత గ్రామాలు, భద్రాచలంలోని పలు కాలనీలు ముంపునకు గురవుతుంటాయి.
వరదలు తగ్గుతాయని అంచనా వేసుకోకూడదని, రానున్న రెండు నెలలూ వరదల కాలమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. అందువల్ల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.