బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మలి విడుత ఎన్నికల ప్రచారం ఖరారైంది. ఈ నెల 13వ తేదీ నుంచి మొత్తం 54 బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.
సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలు విజయవంతంగా జరిగాయి. కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సభలకు పల్లెలు, పట్టణాలు, మారుమూల తండాల నుంచి జనం పెద్ద ఎత్తున
స్వచ్ఛందంగా తరలివచ్చారు.