అనేక సామాజిక-ఆర్థిక నేరాలకు పేదరికమే మూలం. పేదరికం మనిషితనాన్ని దిగజారుస్తుంది. కాని పనులు చేయిస్తుంది. మానవతనే మంట గలుపుతుంది. ఇటీవల రాష్ట్రంలో బయటపడిన చిన్నపిల్లల అక్రమ రవాణా ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ.
కాజీపేట రైల్వే జంక్షన్లో బుధవారం రాత్రి ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది, సీడబ్ల్యూసీ, రైల్వే ఐఆర్బీలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు గురవుతున్న పలువురు బాలురను పట్టుకున్నారు.