బీజేపీ పాలిత అస్సాం ప్రభుత్వం చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పుడో జరిగిన బాల్య వివాహాలపై ఇప్పుడు కేసులు నమోదు చేసి మగవారిని అరెస్ట్ చేయడంపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. మరోవైపు పోక్సో చట్టం కింద �
బీజేపీ సీఎం హిమంత బిస్వా శర్మ తెలివి తక్కువ చర్యల వల్ల అస్సాంలో అమాయక బాలికలు చనిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఒక గర్భిణీ బాలిక మరణంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బాల్య వివాహ కేసులకు సంబంధించి కేవలం మగవారిని మాత్రమే అరెస్ట్ చేయడంపై వారి భార్యలు, తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.