రామ్చరణ్ ‘పెద్ది’ చిత్రంలోని ‘చికిరి చికిరి..’ పాట ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన ఈ పాటలోని హుషారైన బీట్స్, ఆకట్టుకునే రిథమ్ సంగీత ప్రియుల్ని ఫిదా చేస్తున్నాయి.
రామ్చరణ్ ‘పెద్ది’ నుంచి ఇటీవల విడుదలైన ‘చికిరి చికిరి..’ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సందడి అంతాఇంతా కాదు. ఇన్స్టాలో ఈ పాట రీల్స్ చేస్తూ యువతరం చెలరేగిపోతున్నది.