రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రంలోని ‘చికిరి చికిరి..’ పాట ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన ఈ పాటలోని హుషారైన బీట్స్, ఆకట్టుకునే రిథమ్ సంగీత ప్రియుల్ని ఫిదా చేస్తున్నాయి. తెలుగులో వంద మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ పాట పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టిస్తున్నది.
రామ్‌చరణ్ సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్, అద్భుతమైన విజువల్స్ ఈ పాట పాపులర్ కావడానికి దోహదపడిన అంశాలని చెబుతున్నారు. ‘చికిరి చికిరి..’ పాట పాన్ ఇండియా స్థాయిలో సూపర్‌హిట్ కావడంతో ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్నది. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.