శ్రీశైలం బ్యాక్ వాటర్‌లోని జీరో పాయింట్ నుంచి
కృష్ణమ్మ కదిలొచ్చింది.. హెడ్‌రెగ్యులేటరీ ఒక్క గేటును 4 మీటర్లు ఎత్తగా.. టన్నెల్లోకి పరు
గులు పెట్టింది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకఘట్టానికి రంగం సిద్ధమైంది. ఏదుల పంప్‌హౌస్‌కు అనుసంధానించిన 400 కేవీ లైన్లో శుక్రవారం ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్తు సరఫరా సాఫీగా సాగింది.