Sunita Kejriwal : ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ గురువారం సాయంత్రం కలిశారు.
మద్యం పాలసీకి సంబంధించి అవినీతి ఆరోపణల కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచింది.