Arvind Kejriwal | సీబీఐని నిలదీసిన కోర్టు.. రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆసక్తికర పరిణామం
మద్యం పాలసీకి సంబంధించి అవినీతి ఆరోపణల కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచింది.
- మద్యం పాలసీకి సిసోడియానే బాధ్యుడని కేజ్రీవాల్ చెప్పారు..
- సీబీఐ వాదన.. కోర్టు అభ్యంతరం
- ఆయన స్టేట్మెంట్ను మేం చదివాం.. అలా ఎక్కడాచెప్పలేదని స్పష్టీకరణ
- 3 రోజుల సీబీఐ కస్టడీకి ఢిల్లీ సీఎం
Arvind Kejriwal | న్యూఢిల్లీ, జూన్ 26: మద్యం పాలసీకి సంబంధించి అవినీతి ఆరోపణల కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ అభ్యర్థనపై విచారణ జరిపిన ప్రత్యేక జడ్జి అమితాబ్ రావత్.. కేజ్రీవాల్‌ను మూడు రోజుల కస్టడీకి అప్పగించారు. అయితే వాదనల సందర్భంగా రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొన్నది.
నూతన మద్యం పాలసీ కింద లిక్కర్ దుకాణాల ప్రైవేటీకరణకు మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియానే సిఫారసు చేశారని కేజ్రీవాల్ విచారణలో చెప్పారన్న సీబీఐ వాదనపై కోర్టు అభ్యంతరం చెప్పింది. కేజ్రీవాల్ స్టేట్మెంట్ను తాము చదివామని, ఆయన అలాంటి ప్రకటనేమీ చేయలేదని స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ తన ఆలోచన కాదని మాత్రమే కేజ్రీవాల్ చెప్పారని, సీబీఐ తప్పుగా గ్రహించిందని పేర్కొన్నది. కాగా, సీబీఐ ఆరోపణలను కేజ్రీవాల్ కూడా తన వాదనల సందర్భంగా ఖండించారు.
సిసోడియాను దోషిగా చెప్పేలా తాను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని, వాళ్ల లక్ష్యం తమను అప్రతిష్ఠ పాల్జేయడమేనని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ వాస్తవాలను వక్రీకరిస్తుందని అన్నారు. తాను గానీ, సిసోడియా గానీ, తన పార్టీ కానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కేజ్రీవాల్ ఈ సందర్భంగా వాదించారు.
కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మొత్తం వ్యవస్థ: సునీత
తన భర్త జైలు నుంచి బయటకు రాకుండా మొత్తం వ్యవస్థ ప్రయత్నిస్తున్నదని కేజ్రీవాల్ భార్య సునీత ఆరోపించారు. ఇది నియంతృత్వం, ఎమర్జెన్సీతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, అయితే దీనిపై ఈడీ వెంటనే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొన్నదని అన్నారు. ఆ తర్వాతి రోజునే సీబీఐ ఆయన్ను అరెస్టు చేసిందని, ఈ విధంగా వ్యవస్థ మొత్తం కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాకుండా పనిచేస్తున్నదని సునీత ఆరోపించారు. ‘ఇది చట్టం కాదు. ఇది ఒక నియంతృత్వం, ఇది ఎమర్జెన్సీ’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

