Sunita Kejriwal | సీబీఐ ప్రధాన కార్యాలయంలో కేజ్రీవాల్‌ను కలిసిన సునీతా కేజ్రీవాల్
Sunita Kejriwal : ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ గురువారం సాయంత్రం కలిశారు.
Sunita Kejriwal : ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ గురువారం సాయంత్రం కలిశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను మూడు రోజుల పాటు సీబీఐ రిమాండ్‌కు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.
కేజ్రీవాల్‌ను ప్రతిరోజూ 30 నిమిషాల పాటు కలిసేందుకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ను కోర్టు అనుమతించింది. ఇక కేజ్రీవాల్‌ను జైల్లోనే ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలతో కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సునీతా కేజ్రీవాల్ అంతకుముందు ఆరోపించారు.
కేజ్రీవాల్‌ను జైల్లో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తన వ్యవస్ధలన్నింటినీ ప్రయోగిస్తోందని ఇది నియంతృత్వం, ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆమె దుయ్యబట్టారు. కేజ్రీవాల్‌కు జూన్ 20న బెయిల్ లభించగా, వెంటనే ఈడీ స్టే ఉత్తర్వులు తీసుకుంది..ఆ మరుసటి రోజే సీబీఐ ఆయనపై అభియోగాలు మోపింది ఆపై ఆయనను అరెస్ట్ చేశారని సునీతా కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

