మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చి పంటలు కొనుగోలు చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. మ్యానిఫెస్టోలోనూ ఏ పంటకు ఎంత బోనస్ ఇస్తామో తెలియజేస్తూ పట్టిక ప్రచురించింది.
రైతులు పండించిన ధాన్యానికి రూ.500ల బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంపై రైతన్నలు మండిపడుతున్నారు.