రమణ మహర్షి దగ్గరికి ఓ విదేశీ పాత్రికేయుడు వచ్చాడు. ఏండ్లుగా అలా ఒకే చోట ఉంటున్న రమణుల్ని ఉద్దేశించి ‘అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు? ఇది ఎలా సమర్థనీయం. ఈ వైఖరితో మీరు సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు?
మౌనం అత్యంత పాటవమైన పని. వేదవేదాంతాలు సత్యాన్ని గురించి ఎంతో వర్ణిస్తాయి, ఘోషిస్తాయి. చివరికి ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని శాంతించి మౌనాన్ని వహిస్తాయి. అప్పుడు అసలు వర్ణన మొదలవుతుంది. సత్య గురువు మౌనంగా,