మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతుంటాయి. అలాంటి వాటిల్లో చాలా వరకు మొక్కలకు చెందిన ఆకులను మనం కూరగా కూడా వండుకుని తింటుంటాం. అవి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో వేడి చేస్తే ఆ బాధ చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. మూత్రంలో మంట వస్తుంది. ఎండ దెబ్బ తగిలే అవకాశాలు అధికంగా ఉంటాయి.