ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. ఇష్యూ ధర కంటే 29 శాతం అధికంగా ముగిసింది. రూ.710 ధరతో ప్రవేశించిన షేరు ఇంట్రాడేలో 38.83 శాతం వరకు పెరిగింది. చివర్లో రూ.677.10 వద్ద ముగిసింది.
రాష్ర్టానికి చెందిన ఏరోస్పేస్, రక్షణ, ఎనర్జీ రంగ విడిభాగాల తయారీ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీవోకి అపూర్వ స్పందన లభించింది. సంస్థ జారీచేసిన షేర్లకు 80.60 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి.