భారత పురుషుల హాకీ జట్టు నాలుగోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. గతంలో తుదిపోరుకు అర్హత సాధించిన మూడుసార్లు విజేతగా నిలిచిన టీమ్ఇండియా.. శుక్రవారం సెమీఫైనల్లో 5-0తో జపాన్ను చిత్తుచేసింది.
ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గ్రాండ్ విక్టరీతో సెమీఫైనల్ బెర్త్‌కు చేరువైంది. తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న టీమ్ఇండియా.. ఆదివారం మలేషియాతో జరిగిన పోరులో 5-0తో విజయం సాధించింది.