చెన్నై: ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గ్రాండ్ విక్టరీతో సెమీఫైనల్ బెర్త్‌కు చేరువైంది. తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న టీమ్ఇండియా.. ఆదివారం మలేషియాతో జరిగిన పోరులో 5-0తో విజయం సాధించింది. భారత్ తరఫున కార్తీ సెల్వం (15వ నిమిషంలో), హార్దిక్ సింగ్ (34వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (42వ ని.లో), గుర్జాంత్ సింగ్ (53వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రత్యర్థికి కనీస అవకాశం ఇవ్వకుండా మనవాళ్లు విజృంభించడంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడు కొనసాగించిన టీమ్ఇండియా వరుస గోల్స్‌తో చెలరేగితే.. మలేషియా ప్లేయర్లు డిఫెన్స్‌లోనే మిగిలిపోయారు. టోర్నీలో భాగంగా తదుపరి పోరులో సోమవారం డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాతో భారత్ తలపడనుంది.