మొన్నటి దాకా అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ మెల్లగా కుదుటపడుతున్నది. అయిదు జిల్లాల్లో కర్ఫ్యూ సడలించినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెలలో జరిగిన ఘర్షణల్లో 98 మంది మృతి చెందగా, 310 మంది గాయపడినట్టు సమాచారం.
భారత్, చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఈ నెల 9న ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకొన్నది. భౌతిక దాడుల వల్ల ఈ ఘటనలో �