బోథ్ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ గెలుపు తథ్యమని, అత్యధిక మెజార్టీ లక్ష్యంగా కృషి చేద్దామని గుడిహత్నూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జీ తిరుమల్గౌడ్ అన్నారు.
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను గత సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదిలాబాద్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ నుంచి అనిల్ జాదవ్ పోటీ చేయనున్నారు.