పెగడపల్లిలో మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు వేగంవంతం చేయాలని మర్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ పేర్కొన్నారు. మండలంలోని మద్దులపల్లిలో సహకార సంఘం, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆయన సోమవారం పరిశీలించారు.
వానకాలం పంటకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడతామని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ పేర్కొన్నారు.