Airtel | భారీగా పెట్టుబడులు పెట్టినా రిటర్న్స్ చాలా తక్కువ అని, బ్యాలెన్స్ షీట్ సరి చేయాలంటే ఈ ఏడాదిలో అన్ని రీచార్జీ ప్లాన్ల టారిఫ్ లు పెంచక తప్పదని ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ పేర్కొన్నారు.
భారతీ ఎయిర్టెల్ తమ కనీస నెలసరి రీచార్జ్ ప్లాన్ ధరను పెంచింది. రూ.99 విలువ కలిగిన 28 రోజుల మొబైల్‌ఫోన్ సర్వీస్ ప్లాన్ రేటును దాదాపు 57 శాతం పెంచుతూ రూ.155గా మార్చింది.