ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రయోజనాలు, సవాళ్లపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతుండగా, న్యూ టెక్నాలజీతో (AI Tools) పలువురి ఉద్యోగాలు ఊడతాయని కొందరు టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇటీవల 3500 మంది ఉద్యోగులపై వేటు వేసిన టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌పై దృష్టి సారించింది.