ప్రస్తుత (2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ శాఖ బడ్జెట్‌పై జరుపుతున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మొత్తం రూ.64వేల కోట్ల నిధులకు సంబంధించిన ప్రతిపాదనను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి అందించింది.
బీజేపీ పాలనలో దేశ వ్యవసాయరంగం కుదేలవుతున్నది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు నానాటికీ దారుణంగా దిగజారుతుండటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతంగా ఉన్న ఈ వృద్ధిరేటు 2022-23లో 3.3 శాతా�