Telangana Budget | వ్యవసాయం కలగాపులగం.. అత్యధికంగా రూ.72,659 కోట్లు
బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధిక నిధులు కేటాయించినట్టు ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్కమార్క చెప్పారు.
- విద్యుత్తు సబ్సిడీ, నీటిపారుదల ఖర్చులూ ఇందులోనే
- రుణమాఫీకి 26 వేల కోట్లు
- రైతుభరోసాకు 15,075 కోట్లు.. బోనస్‌కు 1800 కోట్లు
- రైతుకూలీలకు1200 కోట్లు
- వ్యవసాయ లెక్క గంగరగోళంగా ఉందంటున్న నిపుణులు
Telangana Budget | హైదరాబాద్, జులై 25(నమస్తే తెలంగాణ): బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధిక నిధులు కేటాయించినట్టు ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్కమార్క చెప్పారు. వ్యవసాయానికి మొత్తంరూ.72,659 వేల కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధరంగాలకు కలిపి మొత్తం రూ.32,019 కోట్ల బడ్జెట్‌ను గత ప్రభుత్వం కేటాయించింది.
ఈ బడ్జెట్లో అనుబంధరంగాలైన ఉద్యానశాఖకు రూ.737 కోట్లు, పౌరసరఫరాల సంస్థకు రూ.3,836 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,980 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం అమలుచేస్తున్న, చేయబోయే పలు పథకాలకు నిధులు కేటాయించింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఈ ఏడాది నుంచి వ్యవసాయ కూలీలకు కూడా రైతుభరోసాను అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇందుకోసం బడ్జెట్లో రూ.1,200 కోట్లను కేటాయించింది. దీంతోపాటు రైతుభరోసా కోసం రూ.15,075 కోట్లు కేటాయించింది. రుణమాఫీ కోసం రూ.26 వేల కోట్లు, ధాన్యం బోనస్‌కు రూ.1,800 కోట్లు కేటాయించింది. వీటితోపాటు రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించేందుకు రూ.106 కోట్లు, పంటల బీమా కోసం 1,300 కోట్లు, రైతుబీమా కోసం 1,589 కోట్లు కేటాయించింది.
విద్యుత్తు సబ్సిడీ, నీళ్ల లెక్కలూ ఇందులోనే..
ప్రభుత్వం వ్యవసాయ శాఖ బడ్జెట్‌ను ఎక్కువగా చూపేందుకు తాపత్రయ పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లోని లెక్కలను వ్యవసాయ, ఆర్థికరంగ నిపుణులు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. వ్యవసాయానికి అవసరమయ్యే విద్యుత్తు సబ్సిడీ, నీటిపారుదల ఖర్చును కూడా ప్రభుత్వం వ్యవసాయ పద్దులోనే చూపడం గమనార్హం. విద్యుత్తు సబ్సిడీ కింద రూ.11,500 కోట్లు, నీటిపారుదల ఖర్చు కింద రూ.10,829 కోట్లు చూపించింది.
ఈ రెండు పథకాలు కలిపి రూ.22,329 కోట్లు చూపించింది. ఈ రెండింటిని తీసేస్తే వ్యవసాయ శాఖ బడ్జెట్ రూ.72,659 కోట్ల నుంచి రూ.50,330 కోట్లుగా ఉంటుంది. రుణమాఫీకి కేటాయించిన రూ.26వేల కోట్లనూ మినహాయిస్తే వ్యవసాయ శాఖ బడ్జెట్ రూ.24 వేల కోట్లేనని నిపుణులు లెక్కవేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం వ్యవసాయరంగానికి రూ.26,831 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన ప్రస్తుతం ప్రభుత్వం గతంతో పోల్చితే రూ.2,831 కోట్లు తక్కువగానే కేటాయించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

