సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ వీఆర్ఎస్కు కారణం ఏమిటి? ఇంకా ఎనిమిదేండ్ల సర్వీస్ ఉండగానే అకస్మాత్తుగా స్వచ్ఛంద పదవీ విరమణ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది.
ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణం వెలుగుచూస్తున్నది. ఇటీవల సోం డిస్టిలరీ మద్యాన్ని అనుమతించి అభాసుపాలైన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో అతినీతికి పాల్పడిందనే విమర్శలు వెల్లువెతున్నాయి.