పదో తరగతి మెమోల విషయంపై ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమయ్యే అవకాశం కనిపిస్తున్నది. అనేక సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. ఈ సారి పదో తరగతి మెమోలను మొత్తం మార్కుల్లేకుండానే ముద్రిస్తున్నారు.
పదో తరగతిలో గ్రేడింగ్ విధానం ఎత్తివేత నేపథ్యంలో విద్యార్థులకు అందించే మెమోలను ఎలా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తేల్చుకోలేకపోతున్నది. ఏ పద్ధతిలో ముద్రించాలన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నది.