మా కలను ప్రభుత్వం సాకారం చేసింది : సంతోష్‌బాబు సతీమణి

సూర్యాపేట : సూర్యాపేటలో కర్నల్ సంతోష్‌బాబు విగ్రహం పెట్టాలనే తమ కలను ప్రభుత్వం సాకారం చేసిందని సంతోష్‌బాబు సతీమణి సంతోషి అన్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం సూర్యాపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సంతోష్‌బాబు సతీమణి పాల్గొని మాట్లాడారు.
సంతోష్‌బాబు మరణంతో తమ కుటుంబం కుంగిపోయిందన్నారు. పెద్దదిక్కు కోల్పోయిన తమ కుటుంబానికి ప్రభుత్వం ఎంతో చేయూతనిచ్చిందని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అమర సైనికుడి కుటుంబానికి సీఎం కేసీఆర్ సాయం చేశారన్నారు. ప్రాణాలు తేలేం కానీ, మీకు అండగా నిలుస్తామని సీఎం భరోసా ఇచ్చారు. రూ.5 కోట్ల సాయం చేసి, ఇంటిస్థలం ఇచ్చి, గ్రూప్ వన్ కేడర్‌లో ఉద్యోగం ఇచ్చారన్నారు. తమ కుటుంబాన్ని సీఎం కేసీఆర్ తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టిన ఆ రోజుని జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. తనను కన్న కూతురిలా చూసుకుని ఓదార్చి సీఎం ధైర్యం చెప్పారన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

