
సూర్యాపేట: జిల్లాలో బతుకమ్మ చీరెల పంపిణీలో అధికారలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని అ దనపు కలెక్టర్ మోహన్ రావు సూచిం చారు.గురువారం కలెక్టరేట్లో బతుకమ్మ చీరెల పంపిణీ పై సంబంధిత అదికారు లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండి తెల్ల రేషన్ కార్డులో పేరు ఉన్న మహి ళలందరికీ చీరెలు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో చీరెలు పంపిణీ కార్యక్రమానికి డీఆర్డీఏ పీడీ నోడల్ అధికారిగా ఉంటా రని తెలిపారు.
కమిషనర్ల పర్యవేక్షణలో పంపిణీ జరపాలన్నారు. వార్డులలో బిల్ కలెక్టర్, మహిళా సంఘ సభ్యురాలు, రేషన్ డీలర్, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి మహిళా సంఘం సభ్యురాలు, చౌక దుకాణాల డీలర్లు కమిటీ సభ్యులుగా ఉంటారని అన్నారు. చీరెల పంపిణీలో భాగంగా పౌర సరఫరాల శాఖ మేనేజర్ ద్వారా జిల్లా కేంద్ర స్టాక్ పాయింట్ నుంచి మండలాల కు అక్కడి నుంచి గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భవనాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి భాగస్వాములను చేసి పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవోలు రాజేం ద్ర కుమార్, కిశోర్ కుమార్, వెంకట్ రెడ్డి, పీడీ కిరణ్ కుమార్, డీఏస్వో విజయ లక్ష్మి, డీఏం రాంపతి నాయక్, ఏవో శ్రీదే వి, పర్వవేక్షకుడు సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.