
సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఏం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఏదుట ఆ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తు న్న ప్రజా వ్యతిరేక విదానాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
దేశంలో పేద ప్రజలు నిత్యావసర వస్తువులు పెరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంత రం అదనపు కలెక్టర్ ఎస్. మోహన్‌రావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు ములకలపల్లి రాములు, జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి, దండ వెంకట్ రెడ్డి, నర్సింహారావు, రవి, అప్పయ్య, వెంకన్న, రజిత తదిత రులు పాల్గొన్నారు.