గరిడేపల్లి, జూన్ 23 : విద్యార్ధులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించాలని గరిడేపల్లి మండల విద్యాధికారి పానుగోతు చత్రునాయక్ అన్నారు. సోమవారం మండలంలోని గానుగబండ, కొండాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయుల భోదనను పరిశీలించారు. విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యేలా పాఠాలు భోదించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు.
పాఠశాలలకు వచ్చిన వంట సామగ్రిని అందజేశారు. విద్యార్ధులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పిచ్చయ్య, బాల సైదిరెడ్డి, జానకిరాములు, శివరాం ప్రసాద్, సీఆర్పీలు రామకృష్ణ, అశోక్‌కుమార్, ఉపాధ్యాయులు నాగయ్య, గోవిందయ్య, జనార్ధన్, మధుసూధన్‌రావు, అన్నపూర్ణ, మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాల్గొన్నారు.