
బొడ్రాయిబజార్: వానకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని ప్రజలంతా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ అన్నారు. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రభలకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన కోసం మనం కార్యక్రమాన్ని ఆదివారం పట్టణంలోని 16వ వార్డులో చేపట్టి మాట్లాడారు.
పట్టణంలోని ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం పది గంటల పది నిమిషాలకు ఓ పది నిమిషాల పాటు తన ఇల్లు, చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం వానాకాలం కావడంతో నీరు నిలిచి దోమలు వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రభలే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. ప్రజలంతా కరోన వ్యాధిని ఎదుర్కొంటూనే సీజనల్ వ్యాధుల పట్ల తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.
అనంతరం మున్సిపల్ సిబ్బందితో కలసి వార్డులో నీరు నిలువ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు ఇంటింటికీ తిరిగి డోర్ స్టిక్కర్స్తో మన కోసం మనం కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సలిగంటి సరిత, మున్సిపల్ ఈఈ జీకేడీ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, మెప్మా టీఎంసీ శ్వేత, వార్డు ఇన్చార్జి శ్రావణ్, ఏఈ సుమంత్, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.