
ఆత్మకూర్.ఎస్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచి నాణ్యమైన విద్యనందించాలని జిల్లా అదనపు కలె క్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. మం గళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని, ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు చేస్తు న్నామని ప్రతి విద్యార్థికి కరోనా వ్యాక్సిన్ వేయించాలన్నారు.
అనంతరం మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పాఠశాలలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఎంపీ డీవో మల్సూర్‌నాయక్, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీవో సంజీవ, సర్పంచ్ వీరారెడ్డి, వైద్యాధికారి ఆనంద్, వెంక టేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు శంకర్‌నాయక్ ,తదితరులు ఉన్నారు.