పెన్ పహాడ్, జనవరి 26 : గణతంత్ర దినోత్సం రోజున జాతీయ జెండాను తలకిందులుగా ఎగురేశాడు ఓ అధికారి. పెన్ పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలోని పశువుల ఆసుపత్రిలో జాతీయ జెండాకు తీవ్ర అవమానం జరిగింది. 77వ గణతంత్ర వేడుకల్లో భాగంగా ఆసుపత్రి వి.ఎల్ ఓ షేక్ సతార్ జాతీయ జెండాను తల కిందులుగా ఎగరేశారు.
జాతీయ జెండాను కాషాయం రంగు పైకి ఉండేలా జాగ్రత్తగా కట్టాల్సింది పోయి.. ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో షేక్ సతార్పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను సరిగ్గా కట్టడం కూడా తెలియదా? ఆయనేం అధికారి? అని గ్రామస్థులు మండిపడ్డారు.