
సూర్యాపేటసిటీ: తెలంగాణ రాష్ట్ర పోలీసు డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లాల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టి అదుపు చేయాలని విజువల్ పోలీసింగ్ ద్వారా ప్రజలతో మమేకంగా ఉండాలని డీజీపీ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి హాజరై జిల్లా వ్యాప్తంగా వ్యవస్థీకృత నేరాలను అదుపు చేశామన్నారు. అలవాటుగా నేరాలకు పాల్పడుతున్న, తరచుగా సమస్యలు సృష్టిస్తున్నవారిపై షీట్స్ నమోదు చేశామన్నారు.
డిజిటల్ జీయో ట్యాగింగ్ ద్వారా పాత నేరస్థులపై నిఘా ఉంచామని జిల్లా ఎస్పీ డీజీపీకి వివరించారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిచి పోలీ సు సేవలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. విజువల్ పోలీసింగ్ ద్వారా ప్రజలతో కలసి పని చేస్తున్నామన్నారు.

సమావేశంలో డీఎస్పీ రవి, నాగారం సీఐ రాజేశ్, సూర్యాపేట పట్టణ సీఐ ఆంజనేయులు, కోదాడ పట్టణ సీఐ నర్సిం హారావు, మునగాల సీఐ ఆంజనేయులు, హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ నర్సింహా, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సురేశ్‌బాబు, ఆర్ఎస్ఐ సంతోష్, కమ్యూనికేషన్, డీసీఆర్బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.