సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేదింటి అడ పిల్లలకు గొప్ప వరం లాంటిదని ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ అన్నారు. జిల్లాలోని నాగారం మండల కేంద్రంలో ఇటీవల కల్యాణలక్ష్మి పథకాన్ని దరఖాస్తు చేసుకున్న 44 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లలకు విహవా సమయంలో తల్లిదండ్రులకు భారం కావొద్దని సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
మన గురించి ఆలోచించే గొప్ప మనసున్న మహానేత సీఎం కేసీఆర్ పది కాలాల పాటు బాగుండాలని మనమందరం కోరుకోవాలన్నారు.