సూర్యాపేట : చిన్నారులు, యువత క్రికెట్లో రాణించాలి, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ సూర్యాపేటకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్, మాజీ భారత క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
క్రీడారంగంలో సూర్యాపేట పేట ఖ్యాతిని జాతీయస్థాయిలో చాటాలన్నారు.
పట్టుదలతో సాధన చేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చన్నారు. ప్రతి ఒక్కరు తాము ఎంచుకున్న క్రీడారంగంలో రాణించాలని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారులకు అకాడమీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎంఎస్కే ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు.అనంతరం ఎం.ఎస్.కె ప్రసాద్ తోపాటు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ రమేష్‌లను శాలువాతో సత్కరించారు.