మేళ్లచెర్వు: స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రా భిషేకం, అమ్మ వారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన పూజలను అర్చకులు శివవిష్ణు వర్దన్శర్మ, ధనుంజయ శర్మ శాస్ర్తోక్తంగా జరిపించారు.
ఈ సందర్భంగా స్వామి వారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి మహా నివేదన, మంగళ నీరాజనం, మంత్ర పుష్ప పూజ లను వేద మంత్రాలతో జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిగింది. కార్యక్రమంలో ఆలయ సిబ్బం ది, భక్తులు పాల్గొన్నారు.
కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయ హక్కు కోసం రేపు బహిరంగ వేలం
స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో 2021 నవంబర్ 1 నుంచి 2022 అక్టోబర్ 31 వరకు (మహా శివరాత్రి 5 రోజులు మినహా) కొబ్బరికాయలు, పూలు పండ్లు, పూజా సామగ్రి విక్రయహక్కు కోసం ఈనెల 27వ తేదీన ఆలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు రూ.5 వేలు చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు.