పెన్పహాడ్, అక్టోబర్ 28 : రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని పెన్పహాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అనాజీపురం, మహమ్మదాపురం గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు వెంటవెంటనే చేరవేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో తాసీల్దార్ లాలూ నాయక్. ఎంపీడీఓ జానయ్య, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, తూముల సురేశ్ రావు, ఏఓ అనిల్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దామోదర్ రెడ్డి, ఆర్తి కేశవులు, మాజీ సర్పంచ్ చెన్నూ శ్రీనివాస్ రెడ్డి, షేక్ జానిమియా, జానయ్య, ధనలక్ష్మి, నీరజ, కవిత, విజయ, ఇందిరమ్మ, సుమతి, రమాదేవి, అన్నమెరి పాల్గొన్నారు.